![]() |
![]() |
.webp)
ఆహా వేదికగా మొదలైన 'అన్ స్టాపబుల్' సీజన్-2 ఇప్పటికే ఆరు ఎపిసోడ్ లు పూర్తి చేసుకుంది. అయితే 'ఆహా' ఇంతకుముందు ప్రభాస్ తో జరిగిన ఇంటర్వ్యూని రెండు భాగాలుగా చేసి విడుదల చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా రెండవ భాగం 'ఆహా' లో స్ట్రీమ్ అవుతోంది.
గోపిచంద్, ప్రభాస్ మంచి స్నేహితులని ఈ ఎపిసోడ్ తో దాదాపు అందరికి తెలిసిపోతుంది. అలా ఉంది ఇద్దరి మధ్య ఆ బాండింగ్. అయితే బాలకృష్ణ చమత్కారం ఈ ఎపిసోడ్ కి అదనపు హంగులను జోడించి ఆసక్తిని రేపుతోంది. గోపిచంద్ వచ్చాక బాలకృష్ణ గారు ఇంటర్వ్యూ మొదలుపెట్టారు."నువ్వు ప్రభాస్ లాగా నవ్వుతుంటావా? మాట్లాడుతుంటావా? " అని గోపిచంద్ ని బాలకృష్ణ గారు అడిగారు. "లేదు సర్.. మాట్లాడుతుంటా" అని గోపిచంద్ సమాధానిమిచ్చాడు. ఆ తర్వాత "నీ సినిమాలన్నింట్లో స్టైలిష్ గా ఉండే సినిమా 'జిల్'. అది నాకు చాలా నచ్చింది. రెండు మూడు సార్లు చూసాను" అని బాలకృష్ణ గారు చెప్పాడు. "అవును సర్.." అని గోపిచంద్ చెప్పాడు. ఆ సినిమాకి ప్రభాస్ కో- ప్రొడ్యూసర్ గా చేశాడు కదా? ఎలా సెట్ అయింది" అని బాలకృష్ణ గారు అడిగారు. " అవును.. వంశీ ఎప్పటి నుంచో సినిమా చేద్దాం అని అంటున్నాడు. అప్పుడు రాధాకృష్ణ ఒక కథ తీసుకొచ్చాడు. అది వంశీ విని ఇది విను గోపి అని నాకు చెప్పాడు. ప్రభాస్ కూడా విని, బాగుందన్నాడు. అలా ఒకే అయింది. అందులో ఆ లుక్ .. ఆ హెయిర్ స్టైల్ దగ్గరుండి చేపించింది మాత్రం ప్రభాస్" అని చెప్పుకొచ్చాడు గోపిచంద్. " ఫస్ట్ ఆ హెయిర్ స్టైలిష్ కి 'కొంచెం అలా సైడ్ కి కత్తిరించు' అని చెప్పాడు గోపి. కానీ నేను వెళ్ళి, వాడు అలానే అంటాడు కానీ కొంచెం ట్రెండీ లుక్ చెయ్ అని చెప్పాను" అని ప్రభాస్ చెప్పాడు.
"మొదటి సినిమా మోసం చేసింది కదా? మరి ఏ ధైర్యంతో ఇక్కడి దాకా వచ్చావ్" అని గోపిచంద్ ని బాలకృష్ణ గారు అడిగారు. "ఫస్ట్ మూవీ ప్లాప్.. ఆ తర్వాత ఒక ఆరు నెలల వరకు ఖాళీగా ఉన్నాను. ఎటు వెళ్ళాలో తెలియదు. ఎవరిని అడగాలో తెలియదు. ఆ తర్వాత తేజ గారు నాకు 'జయం ' మూవీలో అవకాశం ఇచ్చారు. ఆ సినిమా టైంలోనే నేను, ప్రభాస్ మంచి స్నేహితులం అయ్యాం. మొదట చేసిన మూడు సినిమాలు విలన్ రోల్స్. కానీ అవే బేస్. నన్ను నేను నిరూపించుకోవాలనుకున్నాను" అని చెప్పాడు గోపీచంద్. ఆ తర్వాత కృష్ణంరాజు గురించి కాసేపు మాట్లాడారు బాలకృష్ణ. ఇంకా బాహుబలి సినిమాలోని పాటతో 'కృష్ణంరాజు' గెటప్ లతో ఒక 'AV' చూపించారు. దానికి షోలో ఫుల్ గా ఈలలు. 'అన్ స్టాపబుల్' స్టేజ్ మారు మ్రోగింది. ఆ తర్వాత బాలకృష్ణ కొన్ని ప్రశ్నలతో ఇంటర్వ్యూ ముగించారు.
![]() |
![]() |